మల్లనసాగర్ పై మండిపడ్డ మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ | Justice chandra kumar fire on harish rao about mallanna sagar

Justice chandra kumar fire on harish rao about mallanna sagar

Justice chandra kumar mallana sagar, harish rao about mallanna sagar, chandra kumar fire on T govt,

Justice chandra kumar fire on harish rao about mallanna sagar.

హరీష్ ఎంత ఈజీగా గతం మరిచిపోయాడంటే...

Posted: 07/27/2016 02:17 PM IST
Justice chandra kumar fire on harish rao about mallanna sagar

మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలకు రాను రాను మద్ధతు పెరిగిపోతుంది. నేతలే కాదు ప్రజా సంఘాల నేతలు, మేధావులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఈక్రమంలోనే రిటైర్ట్ చీఫ్ జస్టిస్ చంద్రకుమార్ మంత్రి హరీష్ రావు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఉద్యమం బలంగా సాగుతున్న వేళ, హరీశ్ రావు రహదారులను దిగ్బంధం చేసి వంటలు వండుకుని తిన్న ఘటనలకు ఆయన గుర్తు చేశారు. మీరు చేస్తే కరెక్టా... ఇప్పుడు భూములు పోతాయన్న భయంతో ప్రజలు అదే పని చేస్తే తప్పా? అంటూ ఆయన హరీష్ ను ప్రశ్నించారు. భూనిర్వాసితుల మహాధర్నాలో పాల్గొని ప్రసంగించిన ఆయన, ప్రాజెక్టుల పేరిట రైతులను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని ఆరోపించారు. భూముల కోసం రైతులను బలవంతపెట్టి సంతకాలు తీసుకుంటే ప్రాజెక్టులు పూర్తికావని, నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు ఉందని, దాన్ని అడ్డుకోరాదని సూచించారు.

ప్రజలపై దాడి చేయడం అమానుషమని, ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని రిటైర్డ్‌ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని చెప్పిన ఆయన, మల్లన్నసాగర్‌ వద్ద రిజర్వాయర్‌ అవసరంలేదని నిపుణులు మొత్తుకుంటున్నారని ఆయన అంటున్నారు. ఇలాంటి వైఖరే కొనసాగితే గత ప్రభుత్వాలకు పట్టిన గతే టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు పడుతుందని రిటైర్డ్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ హెచ్చరించారు. రైతుల గళం నొక్కిపెడుతూ సీఎం కేసీఆర్, హరీశ్ రావులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malanna sagar  justice chandra kumar  harish rao  

Other Articles